ఆదోని: ఇడ్లీ ఆర్డర్ పేరుతో సినీఫక్కీలో చోరీ

81చూసినవారు
ఆదోని: ఇడ్లీ ఆర్డర్ పేరుతో సినీఫక్కీలో చోరీ
ఇడ్లీ ఆర్డర్ ఉందని నమ్మించి బైక్ దొంగిలించిన ఘటన ఆదోని పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. క్రాంతినగర్‌కు చెందిన శ్రీధర్ ఇడ్లీ బండి నిర్వహిస్తున్నాడు. ఓ యువకుడు 150 ఇడ్లీలు, 20 వడలు కావాలని, మీరు నాతో వస్తే ఇల్లు చూపిస్తానని అన్నాడు. శ్రీధర్ తన బైక్‌పై అతడిని తీసుకెళ్లగా, తాళాలు తీసుకొస్తానని చెప్పి యువకుడు బైక్‌తో పరారయ్యాడు. అనంతరం అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్