ఆదోని: మద్యం సేవించి బస్సులు నడిపిన ఇద్దరు డ్రైవర్లకు జైలు

9చూసినవారు
ఆదోని: మద్యం సేవించి బస్సులు నడిపిన ఇద్దరు డ్రైవర్లకు జైలు
ఆదోని అర్బన్‌లో మద్యం సేవించి బస్సులు నడిపిన ఇద్దరు డ్రైవర్లకు కోర్టు జైలు శిక్ష విధించింది. సోమవారం రాత్రి జరిగిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో హైదరాబాదు వెళ్తున్న గీతా, ఐవీఆర్ఎస్ ట్రావెల్స్‌ బస్సుల డ్రైవర్లు గణేష్, సుధీర్ మద్యం సేవించినట్లు గుర్తించారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా, ఫస్ట్‌ అడిషనల్‌ మెజిస్ట్రేట్‌ లీలాసాయి సుభాష్ గణేష్‌కు 15 రోజులు, సుధీర్‌కు 7 రోజుల జైలు శిక్ష విధించారు. ఈ వివరాలను టూటౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి మంగళవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్