ఆదోని: ఇష్టం లేని పెళ్లి.. రైలు కిందపడి యువతి బలవన్మరణం

2చూసినవారు
ఆదోని: ఇష్టం లేని పెళ్లి.. రైలు కిందపడి యువతి బలవన్మరణం
ఆదోని పట్టణంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. విక్టోరియాపేటకు చెందిన బోగనూరు నాజియాబాను (22) ఇష్టం లేని పెళ్లి సంబంధం కారణంగా మనస్తాపానికి గురై రాయచూరు–గుత్తి మార్గంలో వెళ్తున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు చూపించిన పెళ్లి సంబంధం తనకు నచ్చలేదని యువతి తెలిపినట్లు సమాచారం. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్