ఆదోని వ్యవసాయ మార్కెట్ రద్దులో శుక్రవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో తనకు ప్రత్యేకంగా కుర్చీ వేయలేదని, అవమానించారని మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఆదూరి విజయకృష్ణ, డైరెక్టర్లు వినూత్న నిరసన తెలిపారు. చైర్మన్, టీడీపీ డైరెక్టర్లు, సెక్రటరీ గోవిందప్ప తనకు వివరణ ఇచ్చినా, సమావేశంలో కుర్చీ వేయకుండా అగౌరవపరిచారని వైస్ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా కార్యాలయంలోనూ వేరుగా కుర్చీ ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఈ ఘటనతో పాలకవర్గం సమావేశం గందరగోళంగా మారింది.