ఆదోని: బక్రీద్ రోజున టీచర్లతో పనిచేయించడం దారుణం: డీఎస్‌ఎఫ్

3చూసినవారు
ఆదోని: బక్రీద్ రోజున టీచర్లతో పనిచేయించడం దారుణం: డీఎస్‌ఎఫ్
బక్రీద్ పండుగ రోజున కూడా ఆదోనిలోని నారాయణ పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులతో పని చేయించడం అన్యాయమని డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ టీచర్లతో పని చేయించడం సరికాదని, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి నారాయణ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులను పని చేయించడమే కాకుండా బెదిరింపులకు కూడా పాల్పడుతోందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్