పుష్ప మూవీలో అమ్మవారి వేషధారణలో సీఎంను కలవనున్న అల్లు అర్జున్ ఫ్యాన్

ఆస్పరిలో ఎస్ఎంఎస్ వ్యాధితో బాధపడుతున్న ముగ్గురు పిల్లలను ఆదుకోవాలని కోరుతూ, ఆదోనికి చెందిన తేజ అనే వ్యక్తి సీఎం చంద్రబాబును కలవడానికి కాలినడకన పాదయాత్రగా వెళ్తున్నారు. తాను సినీ హీరో అల్లు అర్జున్ అభిమానినని, పుష్ప సినిమాలో ఆయన నటించిన అమ్మవారి వేషధారణలో సీఎంను కలుస్తానని తేజ తెలిపారు. ఆ పిల్లల కుటుంబాలకు అండగా నిలవాలని, వారికి చికిత్స అందించడంలో ప్రభుత్వమే సహాయం చేయాలని ఆయన కోరారు.
