కర్నూలు రూరల్ మండలం బి. తాండ్రపాడులోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కాలేజీలో ఈనెల 10న అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్. నాగరాజు సోమవారం తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేళాలో జిల్లా పరిశ్రమల శ్రామికవేత్తలు పాల్గొని అప్రెంటిస్‌లను ఎంపిక చేస్తారు. రిజిస్ట్రేషన్ https://apprenticeshipindia.gov.in ద్వారా చేసుకోవచ్చు.