ఎన్టీఆర్ పేదలకు పెన్షన్ పంపిణీ భరోసా కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదోని మండలం బైచిగెరి గ్రామంలో పెన్షన్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. గ్రామ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆమె అన్నారు.