కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం, బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. బుధవారం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ప్రజలందరూ పరస్పర సహకారం, సోదరభావంతో పండుగను జరుపుకోవాలని కోరారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు ఎఆర్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్‌ను నోడల్ అధికారిగా నియమించారు. ఆదోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో జరిగిన సమావేశంలో బందోబస్తు ఏర్పాట్లు, ప్రార్థనా స్థలాల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా, సోషల్ మీడియాలో వదంతుల నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు.