ఆదోని మండలంలోని 104 బసాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ ఉప సర్పంచ్ పి. హనుమంతమ్మ (60) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి వార్తతో వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి, పార్టీకి ఆమె మృతి తీరని లోటని పేర్కొన్నారు.