రహదారి గుంతలపై కూటమి ప్రభుత్వంపై బీఎస్పీ నేత ఫైర్

8చూసినవారు
ఆస్పరి మండలం కారుమంచి గ్రామంలో ఎమ్మిగనూరు-పత్తికొండ ప్రధాన రహదారిపై గుంతలు పూడ్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని బీఎస్పీ తాలూకా అధ్యక్షులు కొమ్మ రమేష్ ఆరోపించారు. శుక్రవారం గ్రామాన్ని సందర్శించిన ఆయన, డిప్యూటీ సీఎం ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని, పనులు సక్రమంగా జరగడం లేదని విమర్శించారు. ఈ గుంతల వల్ల వర్షపు నీరు నిలిచి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్