రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే పార్థసారథి

2909చూసినవారు
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఆదివారం ఆదోనిలో 350 మందికి పైగా రైతులు ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 7 వేలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన ఆయన, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.