ఆదోనిలో పత్తి ఆటో బోల్తా – రైతు గాయాలు

3793చూసినవారు
ఆదోని పట్టణంలోని మాధవరం రోడ్డులో పత్తి లోడుతో వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఆలూరు మండలం మరకట్టు గ్రామానికి చెందిన రైతు ఉసేనప్ప గాయపడ్డారు. ఆయన గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు గుంతలమయం కావడమే ప్రమాదానికి కారణమని ఆటో డ్రైవర్ తెలిపారు. గత పది రోజుల్లో ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకోవడంతో, ప్రజలు రోడ్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్