పాండవగల్ పెద్దచెరువు సమస్య పరిష్కారించాలని డిమాండ్

5చూసినవారు
పాండవగల్ పెద్దచెరువు సమస్య పరిష్కారించాలని డిమాండ్
ఆదోని మండలం పాండవగల్ గ్రామంలోని 20 ఎకరాల పెద్ద చెరువు సమస్య 12 సంవత్సరాలుగా హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని తక్షణమే పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి కే. లింగన్న తహసీల్దార్‌ శేషఫణికి బుధవారం వినతిపత్రం అందజేశారు. గతంలో డివిజన్, జిల్లా కోర్టులు ప్రభుత్వ చెరువుగా తీర్పులు ఇచ్చినప్పటికీ, ఆక్రమికుడు హైకోర్టుకు వెళ్లడంతో సమస్య పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్