ఢణాపురం: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ ఆత్మహత్య

6చూసినవారు
ఢణాపురం: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ ఆత్మహత్య
ఆదోని మండలంలోని ఢణాపురం గ్రామానికి చెందిన సునీత (31) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇస్వీ పోలీసులు శుక్రవారం తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, సునీత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, మనస్తాపంతో ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్