ఆదోనిలో నకిలీ ఎరువుల కలకలం

2264చూసినవారు
ఆదోనిలో నకిలీ ఎరువుల కలకలం
ఆదోని మండలం పెద్దతుంబలంలోని నబీ ఎరువుల దుకాణంలో పట్టుబడిన స్పీక్ డీఏపీ ఎరువులు నకిలీగా ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. కర్ణాటక నుండి తీసుకువచ్చిన ఈ నకిలీ ఎరువులను రైతులకు అమ్మినట్లు వ్యవసాయ శాఖ ఏఓ సుధాకర్ తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు దుకాణ యజమాని ఇలియాస్‌పై ఫిర్యాదు చేసి, ఎస్ఐ మహేశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్