కుప్పగల్‌లో పేకాటరాయుళ్ల అరెస్ట్

1990చూసినవారు
కుప్పగల్‌లో పేకాటరాయుళ్ల అరెస్ట్
ఆదోని మండలంలోని కుప్పగల్ గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గ్రామంలోని దర్గా సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి నిర్వహించి, వారి వద్ద నుంచి రూ. 11,500 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై విద్యశ్రీ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్