ఆదోని మండలం గణేకల్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన హనుమంత్ రెడ్డిపై వెంకటేష్ అనే వ్యక్తి గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కుక్కను తోలేందుకు బయటకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగినట్లు బాధితుని భార్య రామలింగమ్మ తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హనుమంత్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. అర్ధరాత్రి కావడంతో రవాణా సౌకర్యం లేక బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించలేకపోయారు. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు.