ఆదోనిలో గణనాథునికి టీడీపీ నాయకుల ప్రత్యేక పూజలు

1856చూసినవారు
ఆదోని పట్టణంలో బుధవారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో గణనాథులు ఘనంగా కొలువుదీరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో కొలువుదీరిన మహా గణపతికి ఎమ్మెల్సీ బీటి నాయుడు, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, ఇంచార్జి మీనాక్షి నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. గణనాథుని కొలువైన వేడుకలు ఉత్సాహభరితంగా సాగి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించాయి.

సంబంధిత పోస్ట్