ఆదోని పట్టణంలోని మాసా మసీదు కాలనీలో గురువారం ఇంటర్ విద్యార్థి తన్వీర్ (17) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఇంట్లో మోటార్ ఆన్ చేసే సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురవ్వడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.