బుధవారం ఆదోని పట్టణంలో పర్యటిస్తున్న ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి, రోడ్డు పక్కన చిలక జోస్యం చెబుతున్న వ్యక్తి వద్దకు వెళ్లి, ఆదోనికి మంచి కాలం ఉందా అని ప్రశ్నించారు. చిలక మంచి పత్రాన్ని ఎంచుకోవడంతో స్థానికులు ఆసక్తిగా వీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.