ఆదోని జిల్లా సాధనపై జేఏసీ ఆందోళన కొనసాగింపు

1518చూసినవారు
ఆదోని జిల్లా సాధనపై జేఏసీ ఆందోళన కొనసాగింపు
ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం 165వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు దాసరి నరేష్ కుమార్, మాదాసు జగన్, పి. ఎస్. వీరేష్ మాట్లాడుతూ, ప్రజల చేత ఎన్నుకోబడిన పాలక, ప్రతిపక్ష నాయకులు ఆదోని జిల్లా ఏర్పాటు విషయంలో మౌనం పాటించడం బాధాకరమని విమర్శించారు. ఐదు నియోజకవర్గాల అభివృద్ధి, భవిష్యత్ తరాల అభివృద్ధి, విద్యా అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి దృష్ట్యా ఆదోని జిల్లా అత్యంత అవసరమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్