కౌతాళం మండలంలోని రౌడూరు గ్రామానికి వెళ్తున్న ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు శనివారం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చేందుకు ఒక అడుగు మేర తారు రోడ్డు పక్కన మట్టి రోడ్డు వైపు వెళ్లింది. దీంతో నేల మెత్తగా ఉండటంతో బస్సు చక్రాలు కూరుకుపోయి బస్సు ఒక వైపునకు ఒరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవరు, కండక్టర్లు అందులో ప్రయాణి స్తున్న 16 మందిని సురక్షితంగా కిందకు దించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకు న్నారు.