కర్నూలు: ఇళ్ల గణనకు రాకపోతే 1855కు కాల్ చేయండి: కలెక్టర్

2చూసినవారు
కర్నూలు: ఇళ్ల గణనకు రాకపోతే 1855కు కాల్ చేయండి: కలెక్టర్
జనగణన-2027లో భాగంగా నిర్వహిస్తున్న ఇళ్ల జాబితా, ఇళ్ల గణన ప్రక్రియ జూన్ 5తో ముగియనుంది. సర్వేకు రానివారు 1855 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి బుధవారం సూచించారు. సమీప గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ వివరాలు అందించవచ్చని తెలిపారు. దేశాభివృద్ధికి కీలకమైన జనాభా గణనలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని, ఖచ్చితమైన సమాచారం అందించి దేశాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ కోరారు. గణన సిబ్బంది ఇంటికి రాకపోయినా ఆందోళన చెందకుండా అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్