కర్నూలు: ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించాలి: ఎస్వీ

5చూసినవారు
వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడల్‌లో ప్రయివేటీకరించాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం కర్నూలులో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన కళాశాలలను పూర్తి చేయడాన్ని అడ్డుకుంటోందని విమర్శించారు. ఈనెల 12న జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్