గణేకల్‌లో వ్యక్తి దారుణ హత్య

2573చూసినవారు
గణేకల్‌లో వ్యక్తి దారుణ హత్య
ఆదోని మండలం గణేకల్ లో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణలో హనుమంతరెడ్డి (50) హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన వెంకటేశ్‌తో కొన్ని నెలలుగా విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, తన భార్యపై వెంకటేశ్ దుష్ప్రచారం చేస్తున్నాడనే అనుమానంతో మూడు నెలల కిందటే ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వెంకటేశ్ గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ హనుమంతరెడ్డి చికిత్స పొందుతూ కర్నూలులో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్