ఆదోనిలో మెట్లపై నుంచి జారి పడి వ్యక్తి మృతి

0చూసినవారు
ఆదోనిలో మెట్లపై నుంచి జారి పడి వ్యక్తి మృతి
ఆదోని పట్టణంలోని ఎస్కేడీ కాలనీలో గోపాలకృష్ణ (57) అనే వృద్ధుడు మెట్లపై నుంచి జారిపడి మృతిచెందారు. బుధవారం రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గోపాలకృష్ణ మాధవరం గ్రామంలో పెట్రోలు బంక్ నిర్వహిస్తూ ఆదోనిలో నివాసం ఉంటున్నారు. మేడపై నుంచి కిందికి దిగుతుండగా మెట్లపై నుంచి జారి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందారు. మృతుడి తమ్ముడు సుధాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్