మండగిరి: ప్రజలకు సేవలు మరింత మెరుగ్గా అందించాలి

1చూసినవారు
మండగిరి: ప్రజలకు సేవలు మరింత మెరుగ్గా అందించాలి
మంగళవారం ఆదోని మండలం మండగిరి గ్రామ సచివాలయం-1ను జిల్లాస్థాయి అధికారులు సందర్శించారు. డీఎస్‌జీడబ్ల్యూఓ భాస్కర్ నాయుడు, ఎంజీఎస్‌డబ్ల్యూఓ ఆంజనేయులు, లక్ష్మన్న సచివాలయాన్ని పరిశీలించి, సిబ్బందితో సమావేశమై ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. ప్రజలకు సేవలు మరింత మెరుగ్గా అందించాలని, ఐవీఆర్‌ఎస్ కాల్స్ స్పందనను మెరుగుపరచాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్