ఆదోనిలోని వైఎస్సార్ నగర్‌లో ట్రాన్స్‌జెండర్ జాను ఇంట్లోకి చొరబడిన దుండగులు 6.5 తులాల బంగారం, 16 తులాల వెండి, రూ.2 లక్షల నగదును అపహరించుకెళ్లారు. నిశ్చితార్థ వేడుక ముగించుకుని నగలను బీరువాలో పెట్టి, భోజనం కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ దోపిడీ జరిగింది. తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లై ఉండటంతో బాధితురాలు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.