ఆదోని జిల్లా కేంద్రం ఏర్పాటు అంశంపై ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి బుధవారం ఆదోనిలో మీడియాతో మాట్లాడుతూ, తాను మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మండలాల విభజన చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 13 నెలల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, మండలాల విభజన ప్రక్రియను ప్రజాభిప్రాయ సేకరణకు తెచ్చారని చెప్పారు. జిల్లా కేంద్రం ఏర్పాటు అంశాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించి, సీఎంకు వినతిపత్రం ఇచ్చానని, ఇది కూడా ప్రజాభిప్రాయ సేకరణకు వస్తుందని ఆయన తెలిపారు.