ఆదోని మండల పరిధిలోని నాగలాపురం వద్ద ఆదివారం ఆదిగురువూర్ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన బి. రాజ్మాల్ (24) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గ్రానైట్ పనుల్లో ఉండగా రాయి ఛాతికి తగలడంతో కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతుడిగా నిర్ధారించారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.