గురువారం కర్నూలు జిల్లాలోని హనుమాన్ నగర్ ప్రాంతంలో
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, వారి సమస్యలను తెలుసుకున్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా
టీడీపీ పనిచేస్తుందని,
ఎన్టీఆర్ భరోసా పథకం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని నాయకులు తెలిపారు.