ఆదోని మండలంలోని పెద్దతుంబలం గ్రామ పరిధిలో కేసీ కెనాల్ వద్ద పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 6, 200 నగదు, మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పెద్దతుంబలం ఎస్సై విద్యశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. పెద్దతుంబలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.