ఆదోనిలో ఆటో డ్రైవర్లపై పోలీసుల స్పెషల్ డ్రైవ్

886చూసినవారు
ఆదోనిలో ఆటో డ్రైవర్లపై పోలీసుల స్పెషల్ డ్రైవ్
ఆదోని పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, పాత బ్రిడ్జి, ఆర్ట్స్ కాలేజ్ ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లపై పోలీసులు మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వన్ టౌన్, ట్రాఫిక్ సీఐలు చంద్రశేఖర్, మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రైవ్‌లో, కొందరు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం, యూనిఫామ్ ధరించకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం వంటి లోపాలను పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి లోపాలను నియంత్రించేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్