ఆదోని పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన పవన్ కుమార్ (30) బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పెసలబండ గ్రామంలో దేవర ఉత్సవంలో పాల్గొని తిరిగి ఆదోనికి వస్తుండగా, బైసిగేరి గ్రామ బైపాస్ వద్ద కర్ణాటకకు చెందిన జీపు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.