ఆదోని మున్సిపల్ కమిషనర్, ఎంహెచ్ఓ ఆదేశాల మేరకు, రానున్న మహాయోగి లక్ష్మమ్మ 94వ వెండి రథోత్సవం జాతర సందర్భంగా మంగళవారం పట్టణంలో శానిటేషన్ పనులు ప్రారంభమయ్యాయి. మే 9న జరిగే జాతరను పురస్కరించుకుని, ఈనెల 17వ తేదీ నుంచి ప్రధాన రహదారులపై ప్రత్యేక శుభ్రత చర్యలు చేపడుతున్నారు. కాలువల్లో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తూ డిసిల్టేషన్ పనులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రధాన రహదారులను పరిశుభ్రంగా ఉంచేందుకు అత్యవసర పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. జాతర సమయంలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.