రెండో ముంబాయి: ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలి

12చూసినవారు
రెండో ముంబైగా పేరుగాంచిన ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని, అలాగే ఆరేకల్ సమీపంలోని మెడికల్ కళాశాలను పూర్తి చేసి ప్రారంభించాలని మంగళవారం ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక డిమాండ్ చేశారు. ఆదోనిలో రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపిన వారు, ఆదోని జిల్లాగా ప్రకటించేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భీమాస్ సర్కిల్‌లో 18వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్