ఆదోనిలోని రెవెన్యూ కార్యాలయంలో గురువారం ఉదయం అటెండర్‌గా పనిచేస్తున్న ప్రకాష్‌తో స్వీపర్ పనులు చేయించడం వివాదాస్పదమైంది. హోదాకు విరుద్ధంగా పనులు అప్పగించడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వీపర్లకు వేతనాలు చెల్లిస్తూనే ఈ విధానం ఎందుకు అనేది ప్రశ్నార్థకంగా మారింది.