ఆదోనిలో చోరీ.. 24 తులాలు బంగారం, రూ. 1. 24 లక్షల నగదు దొంగతనం

2635చూసినవారు
ఆదోని పట్టణంలోని స్థానిక ఆర్టీసీ కాలనీలో శనివారం దుండగులు ఆంజనేయుల ఇంటి తాళాలను పగలగొట్టి 24 తులాల బంగారం, రూ. 1. 24 లక్షల నగదును చోరీ చేశారు. ఆంజనేయులు సొంతూరు వెళ్లిన సమయంలో ఇదే అదునుగా భావించిన దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి పక్కన నివాసం ఉంటున్న బ్యాంకు ఉద్యోగి రాజశేఖర్ తాళాలు పగలబడి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్