గురువారం ఆదోని పట్టణంలోని మార్కెట్ యార్డ్ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైతులు పంటల అమ్మకానికి భారీగా తరలిరావడంతో కొత్త బ్రిడ్జి చివరి నుంచి పాత బ్రిడ్జి కింద యార్డు వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీనితో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. యార్డు రోడ్డు పనుల కారణంగా వాహనాలు పాత బ్రిడ్జి దారిలో మళ్లించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.