ఆదోనిలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి

3చూసినవారు
ఆదోనిలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి
ఆదోనిలోని శిల్ప అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్న అరుగుపై మంగళవారం సుమారు 62 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. గత మూడు రోజులుగా అక్కడే ఉంటున్న వృద్ధుడు, అనారోగ్యం కారణంగా ఆహారం తీసుకోలేని స్థితిలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. తీవ్రమైన ఎండలు, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతుడి వివరాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :