
ఆళ్లగడ్డ: ఆస్తి వివాదం హత్య.. నిందితుల అరెస్ట్
ఆళ్లగడ్డ మండలం ఆర్. కృష్ణాపురం గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి వివాదాల కారణంగా గుర్రం దేవభక్తుడిని అదే గ్రామానికి చెందిన విజయరాజు, సుధారాణిలు రోకలి బండతో హత్య చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.

































