Nov 19, 2025, 02:11 IST/రాజేంద్రనగర్
రాజేంద్రనగర్
ఎనిమిది మంది సంతానం.. పోషించలేక ఆత్మహత్య
Nov 19, 2025, 02:11 IST
మైలార్దేవుపల్లి పరిధిలో ఎనిమిది మంది సంతానం భారాన్ని మోయలేక బిహార్‌కు చెందిన నౌషాద్ (45) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మీగూడలో స్థిరపడిన నౌషాద్ దంపతులకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాయకష్టం చేసి పిల్లలను పోషిస్తున్న నౌషాద్ ఆర్థిక భారం పెరగడంతో తాగుడుకు బానిసయ్యాడు. పిల్లలను పోషించలేనని భార్యతో చెప్పి, మూడు రోజుల క్రితం గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు.