Mar 06, 2026, 08:03 IST/షాద్నగర్
షాద్నగర్
వైద్య అరోగ్య సేవల ప్రత్యేక కార్యక్రమాలు
Mar 06, 2026, 08:03 IST
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా, వైద్య ఆరోగ్య సేవల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రేపటి నుండి (మార్చి 6, 2026) జిల్లా వ్యాప్తంగా స్పెషలిస్ట్ వైద్యులచే ఆరోగ్య సేవలు ప్రారంభించబడతాయి. ఈ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12, 2026 వరకు కొనసాగుతుంది. మొదటి దశలో, మార్చి 6 నుండి మార్చి 31 వరకు, మాతృ ఆరోగ్యం, మహిళా ఆరోగ్యం, శిశు ఆరోగ్యం మరియు వృద్ధుల కోసం ప్రత్యేక పరీక్షలు మరియు చికిత్సలు అందించబడతాయి.