ట్రాక్టర్ కిందపడి యువకుడు మృతి

7చూసినవారు
ట్రాక్టర్ కిందపడి యువకుడు మృతి
రుద్రవరం మండలంలోని మాచినేనిపల్లె నాలుగు రోడ్ల కూడలి సమీపంలో ట్రాక్టర్ కిందపడి ఓ యువకుడు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. చందలూరు గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి(28) ట్రాక్టర్ నడపు కుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ట్రాక్టరుతో కొత్తూరు. గ్రామం వైపు వేగంగా వస్తూ రహదారి పక్కన మట్టిదిబ్బపై ఎక్కించాడు. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పడంతో అతను రహదారిపై పడ్డాడు. ట్రాక్టర్ ట్రాలీ అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్