ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చాగలమర్రి మండలం చిన్న వంగలికి చెందిన
టీడీపీ నాయకుడు నరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. నంద్యాల నుంచి చాగలమర్రికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేంద్రతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.