ఆళ్లగడ్డలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ కార్యకర్తల సమావేశంలో వీహెచ్పీ తాలూకా అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, హిందువులంతా సమైక్యంగా నిలిస్తేనే ధర్మం కాపాడబడుతుందని అన్నారు. కుల సంఘాల పరిమితులను దాటి సమస్యల పరిష్కారం కోసం ఒక తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఐక్యత ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.