ఆళ్లగడ్డ: స్వచ్ఛ అహోబిలంకు అందరూ భాగస్వాములు కావాలి

9చూసినవారు
ఆదివారం అహోబిలంలో నిర్వహించనున్న ‘స్వచ్ఛ అహోబిలం’ కార్యక్రమంపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోనేటి, ఆలయ పరిసరాల పరిశుభ్రతలో ప్రజలు, అధికారులు, దేవస్థానం సిబ్బంది భాగస్వాములు కావాలని, అహోబిలం పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్