ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల-పేరాయిపల్లె హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అయ్యలూరు గ్రామానికి చెందిన చిన్న కంబగిరి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో జాతరకు వెళ్తుండగా, కారు ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడగా, వారిని వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.