ఆళ్లగడ్డ శాఖ గ్రంథాలయంలో ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు సమ్మర్ ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారి అరుణకుమారి తెలిపారు. విద్యార్థుల అభివృద్ధికి కథలు, డ్రాయింగ్, క్విజ్ పోటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శిబిరాలు జరుగుతాయని, విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.